రాష్ట్రంలో కరోనా రెండోదశ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 2 వేలకు చేరుకుంది. కొవిడ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. మరోవైపు నగరంలోనూ కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు పలుచోట్ల స్వచ్ఛంద నిర్బంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బేగంబజార్పై ఆంక్షలు విధించారు వ్యాపార సంఘాలు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించారు. వినియోగదారులు మాస్కు, భౌతిక దూరం తప్పక పాటించాలని సూచించారు.
రేపట్నుంచి సాయంత్రం 5గంటల తర్వాత బేగం బజార్ బంద్ - Begum Bazar from 9am to 5pm
రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతోన్న నేపథ్యంలో బేగంబజార్ వ్యాపార సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరవాలని మూకుమ్మడిగా ప్రకటించారు.

బేగంబజార్పై ఆంక్షలు