తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్​ బంద్​కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు, ట్రేడ్​ యూనియన్లు - శుక్రవారం భారత్​ బంద్​

పెరుగుతున్న చమురు ధరలు, జీఎస్టీ సవరణలకు వ్యతిరేకంగా... అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ఇవాళ దేశవ్యాప్త బంద్‌ తలపెట్టింది. అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం- ఐట్వా రోడ్లను దిగ్బంధిస్తామని ప్రకటించింది.

నేడు భారత్​ బంద్​కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు, ట్రేడ్​ యూనియన్లు
నేడు భారత్​ బంద్​కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు, ట్రేడ్​ యూనియన్లు

By

Published : Feb 26, 2021, 5:01 AM IST

శుక్రవారం దేశవ్యాప్తంగా అఖిలభారత వ్యాపార సమాఖ్య బంద్‌కు పిలుపునిచ్చింది. పెరుగుతున్న చమురు ధరలు, జీఎస్టీ, ఎలక్ట్రానిక్‌ వేబిల్‌కు నిరసనగా ఆందోళన చేపట్టనుంది.ఈ బంద్‌లో... 8కోట్ల వ్యాపారులకు సంబంధించిన 40వేల వాణిజ్య సంఘాలు పాల్గొంటాయని, 40లక్షల వాహనాలు నిలిచిపోతాయని ప్రకటించింది. పలు కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ఆలిండియా ట్రాన్స్ పోర్ట్, హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్లు బంద్‌లో పాల్గొననున్నట్లు ప్రకటించాయి.

బంద్‌కు సంపూర్ణంగా మద్దతిస్తామని సీపీఐ, సీపీఎం తెలిపాయి. అన్ని రకాల సేవలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన కేంద్రం... పెట్రోల్‌, డీజిల్‌ను తీసుకురాకుండా ఖజనా నింపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇదీ చూడండి:భారత్​ బంద్​కు సీపీఎం మద్దతు: తమ్మినేని వీరభద్రం

ABOUT THE AUTHOR

...view details