దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. నల్గొండ బస్ డిపో ఎదుట కార్మికులు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపారు. పొరుగు సేవల విధానానికి చరమ గీతం పాడి.. కనీస వేతనాలు పెంచాలంటూ నినాదాలు చేశారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సులను బయటకు రాకుండా తెల్లవారుజాము నుంచే డిపోల ఎదుట అఖిలపక్షం నాయకులు ఆందోళన చేశారు. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేశారని.. వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చి రైతుల నడ్డి విరిచే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.