తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్మిక సంఘాల ఆందోళన.. స్తంభించిన రవాణా - స్తంభించిన రవాణా

దేశవ్యాప్త కార్మిక సంఘాల నిరసనకు రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ తరుణంలో ఆర్టీసీ ముందస్తు జాగ్రత్తగా రవాణా సేవలను నిలిపివేసింది.

trade-union-protest-at-sathupalli-khammam-frozen-transport
కార్మిక సంఘాల ఆందోళన.. స్తంభించిన రవాణా

By

Published : Nov 26, 2020, 8:03 AM IST

Updated : Nov 26, 2020, 9:18 AM IST

దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. సమ్మె నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు విధించారు. ఆర్టీసీ డిపోల పరిధిలో ఆందోళనకు అనుమతి నిషేధించారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

డిపోలకే పరిమితమైన బస్సులు

రక్షణ సంస్థల కార్పొరేటీకరణ, కార్మిక విధానాల్లో సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెకు మద్దతుగా 46 వేలమంది సింగరేణి కార్మికులు విధుల బహిష్కరించారు.

బోసిపోయిన వ్యాపార సముదాయం

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిరసన చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి.

ఇదీ చూడండి :దమ్ముంటే హైదరాబాద్​లో సభ పెట్టండి: ప్రధానికి సవాల్

Last Updated : Nov 26, 2020, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details