తెలంగాణ

telangana

'ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ వేతనాలు చెల్లించాలి'

గవర్నర్ తమిళిసైకు కార్మిక సంఘాలు వినతిపత్రం అందించాయి. ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని నాయకులు కోరారు.

By

Published : Nov 4, 2019, 7:31 PM IST

Published : Nov 4, 2019, 7:31 PM IST

'కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలి'

'కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలి'

ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ, సీఐటీయూ, టీఎన్​టీయూసీ కార్మిక సంఘాల ప్రతినిధుల బృదం ఇవాళ రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసైను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ కార్మికులు సెప్టెంబర్ నెలలో పనిచేసినప్పటికీ జీతాలు చెల్లించకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో కాకుండా సామరస్యంగా కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ విజ్ఞప్తులకు గవర్నర్ సానుకూలంగా స్పందించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details