తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీగా వాణిజ్య పన్నుల రాబడి.. గతేడాదితో పోల్చితే ఎంత ఎక్కువంటే?

Telangana Commercial Taxes : రాష్ట్రంలో గడిచిన పది నెలల్లో రూ.53,500 కోట్ల మేర వాణిజ్య పన్నుల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోల్చితే ఇది 31శాతం అధికమని అధికారులు వెల్లడించారు. జీఎస్టీ ద్వారా గడిచిన 10 నెలల్లో రూ.24,874.39 కోట్ల రాబడి వచ్చింది.

Telangana Commercial Taxes, telangana revenue
భారీగా వాణిజ్య పన్నుల రాబడి.. గతేడాదితో పోల్చితే ఎంత అధికం?

By

Published : Feb 4, 2022, 10:26 AM IST

Telangana Commercial Taxes : రాష్ట్రంలో గడిచిన 10 నెలల్లో రూ.53,500 కోట్ల మేర వాణిజ్య పన్నుల ఆదాయం వచ్చింది. అంతకముందు ఏడాదితో పోల్చితే ఇది 31శాతం అధికమని అధికారులు వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు రూ.40,757 కోట్లు ఆదాయం రాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు రూ.53,424.98 కోట్లు వచ్చాయి. ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు వచ్చిన మొత్తంలో.... పెట్రోల్‌ విక్రయాలపై వ్యాట్‌ ద్వారా రూ.11,033 కోట్లు సమకూరాయి. మద్యం అమ్మకాలపై వ్యాట్‌ ద్వారా రూ.11,258 కోట్లు వచ్చాయి.

జీఎస్టీ ద్వారా గడిచిన 10 నెలల్లో రూ.24,874.39 కోట్ల రాబడి వచ్చింది. మరో 6,258.99 కోట్లు కేంద్రం నుంచి జీఎస్టీ పరిహారం రాష్ట్రానికి వచ్చింది. జనవరి నెలలో 6,136.45 కోట్లు వాణిజ్య పన్నుల ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాది జనవరిలో వచ్చిన మొత్తం కంటే 17శాతం అధికమని వాణిజ్య పన్నులశాఖ తెలిపింది. ఫిబ్రవరి, మార్చినెలల్లో ఇంతకంటే ఎక్కువ మొత్తాలు వస్తాయని... కాబట్టి వాణిజ్య రాబడులు రూ.65వేల కోట్ల మార్క్‌ దాటుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:Mahesh Bank Server Hack Case : మహేశ్‌ బ్యాంక్‌ కేసులో ముగ్గురు దిల్లీ వాసుల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details