హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్న వ్యాపారస్తులు తమ లైసెన్స్‌లను ఈ నెలాఖరులోగా రెన్యువల్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ట్రేడ్‌లైసెన్స్‌ల రెన్యువల్‌లో జాప్యం చేస్తే... ఫీజుకు అదనంగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
నిర్ణీత కాలం తర్వాత జులై 1 నుంచి ఆగస్టు 30 వరకు ట్రేడ్ లైసెన్స్‌ల రెన్యువల్‌కు వచ్చే దరఖాస్తులపై అదనంగా 25 శాతం అపరాధ రుసుంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు 31 నుంచి అన్ని దరఖాస్తులపై అదనంగా 50శాతం అపరాధ రుసుంగా వసూలు చేయనున్నట్లు వివరించారు.