హైదరాబాద్ మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెల గూడలో వివేకనంద చౌరస్తా వద్ద ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. సూర్యాపేటకు చెందిన నాగేశ్, మంగమ్మ బతుకుదెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు.
మైనర్ నడుపుతున్న ట్రాక్టర్ ఢీకొని 12ఏళ్ల బాలుడి దుర్మరణం.. - హైదరాబాద్ నేర వార్తలు
ఓ మైనర్ ట్రాక్టర్‌ను నడిపి బీభత్సం సృష్టించాడు. ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ ఘటన హైదరాబాద్ మీర్‌పేట పరిధిలో చోటుచేసుకుంది.
జిల్లెలగూడలోని దాసరి నారాయణ కాలనీలో నివాసం ఉంటూ మార్బుల్స్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారి రెండవ కుమారుడైన జగదీశ్(12) బాలాపూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. నిన్న సైకిల్‌పై వెళ్తుండగా... ట్రాక్టర్ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ట్రాక్టర్ నడిపేవారు మైనర్లుగా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి:వైద్య సలహాలు మేం పాటిస్తాం.. మీరూ పాటించండి