కేంద్రం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను నిర్వీర్యం చేసే కుట్ర పన్నిందని తెలంగాణ ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు ఆర్ఎస్ఎస్, భాజపాల కుట్రలను అడ్డుకుంటామన్నారు. టీపీఎస్ ఐకాస ఆధ్వర్యంలో.. 'భారత రాజ్యాంగ రక్షణ సదస్సు' పేరిట ఈనెల 28న రవీంద్రభారతిలో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, లక్డీకాపూల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రం కుట్రలను అడ్డుకుంటాం: టీపీఎస్ ఐకాస - తెలంగాణ ప్రజా సంఘాల ఐకాస
కేంద్రం... ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేయాలని చూస్తోందని.. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. భాజపా... 2014 నుంచి ఇప్పటిదాకా 28 ప్రభుత్వ రంగ సంస్థలను.. ప్రైవేటుపరం చేసిందని గుర్తు చేశారు. హైదరాబాద్, లక్డీకాపూల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడారు.
కేంద్రం... ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేయాలని చూస్తోందని.. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి మండిపడ్డారు. భాజపా... 2014 నుంచి ఇప్పటిదాకా 28 ప్రభుత్వ రంగ సంస్థలను.. ప్రైవేటుపరం చేసిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌నూ అమ్మేసి.. 3లక్షల కుటుంబాలను రోడ్డు పడేసేందుకు సిద్ధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డా . బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని.. ఈ నెల 14న ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దాకా 'నీలి కవాతు' నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:సునీల్ నాయక్ ఆత్మహత్య రాష్ట్ర ప్రభుత్వ హత్యే: బండి సంజయ్