తెలంగాణ

telangana

By

Published : Oct 25, 2019, 9:31 PM IST

ETV Bharat / state

'సమ్మెపై రాష్ట్ర భాజపా ఎందుకు మౌనంగా ఉంటోంది...?'

21 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో రాష్ట్ర భాజపా పాత్రపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కేవలం ఓదార్పు మాటలకే పరిమితమవుతోందని... సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి చర్య తీసుకోవటం లేదని ఆరోపించారు.

TPCC WORKING PRESIDENT PONNAM PRABHAKAR ON TELANGANA BJP LEADERS

ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చొరవ తీసుకోవాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. కేవలం ఓదార్పు మాటలతో సరిపుచ్చి ఉద్యమానికి మద్దతు ఇస్తామంటే సరిపోదని హితవు పలికారు. 21 రోజులుగా సమ్మె జరుగుతున్నా... రాష్ట్ర భాజపా ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఆర్టీసీ ఐకాస డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని కేంద్రాన్ని ఎందుకు కోరటంలేదని అడిగారు. జీతాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా... భాజపా ప్రేక్షకపాత్ర వహించడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఫెడరల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి ఆర్టీసీ కార్మిక వర్గానికి న్యాయం చేయాలని పొన్నం ప్రభాకర్​ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details