తెలంగాణ

telangana

ETV Bharat / state

మొన్న దూషించుకొని... ఇప్పుడు మంతనాలు: పొన్నం

దిల్లీపై పోరాటం చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మొన్న తిట్టుకున్న వాళ్లు... ఇప్పుడు రహస్యంగా ఎందుకు కలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ, అమిత్​ షా అందరూ ఒకటేనని విమర్శించారు.

tpcc-working-president-ponnam-prabhakar-fire-on-trs-government
మొన్న దూషించుకొని... ఇప్పుడు మంతనాలు: పొన్నం

By

Published : Dec 12, 2020, 2:22 PM IST

దిల్లీపై పోరాటం చేస్తానని చెప్పి ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తూ భాజపా నేతలను కలుస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్‌, అమిత్‌ షా, మోదీ, ఒవైసీ అందరూ ఒకటేనని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దూషించుకొని... ఇప్పుడు రహస్యంగా కేంద్రంతో మంతనాలు జరపటాన్ని ప్రజలు గమనిస్తున్నారని పొన్నం అన్నారు. దేశంలోని ఇతర పార్టీలపైన సీబీఐ, ఈడీ పేరిట దాడులు చేస్తున్న భాజపా... కేసీఆర్‌ అవినీతిపైన ఎందుకు విచారణ జరిపించటం లేదని ప్రశ్నించారు.

మొన్న దూషించుకొని... ఇప్పుడు మంతనాలు: పొన్నం

వరద సాయం అడగడానికైతే... అధికారులను ఎందుకు వెంట తీసుకువెళ్లలేదని నిలదీశారు. భాజపాకి భయపడే దిల్లీకి వెళ్లారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడితే... కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు.

ఇదీ చదవండి:బర్త్​డే స్పెషల్​: యూవీ ఎక్కడుంటే అక్కడ సందడే!

ABOUT THE AUTHOR

...view details