తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా అధికారిణిపై మంత్రి వ్యాఖ్యలు వైరల్.. గీతారెడ్డి సీరియస్ - తెలంగాణ వార్తలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని టీపీసీసీ(TPCC) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి(geetha reddy) అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సభలో మహిళా అధికారిణితో మంత్రి అవమానకరంగా మాట్లాడటం అమానవీయమని ఆరోపించారు.

CONGRESS, geetha reddy
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గీతారెడ్డి

By

Published : Jul 10, 2021, 3:46 PM IST

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి వ్యాఖ్యలు

మహిళలకు రక్షణ లేని రాష్ట్రంగా తెలంగాణ తయారవుతోందని టీపీసీసీ(TPCC) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి(Geetha reddy) ధ్వజమెత్తారు. బాధ్యత గల ఓ సీనియర్‌ మంత్రి... ఒక ఎంపీడీవో(MPDO) అధికారిణిని... సభలో అవమానపరచడం అమానవీయమని ఆరోపించారు. తక్షణమే మంత్రివర్గం నుంచి ఆయనను సస్పెండ్‌ చేయాలని గీతారెడ్డి డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో టీపీసీసీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌తో కలిసి ఆమె మాట్లాడారు.

సీఎం స్పందించాలి

ఉద్యోగాల నుంచి తొలగించారని స్టాఫ్‌ నర్సులు(staff nurse) తమ గోడును వెళ్లబోసుకుంటే... వారిపై పోలీసులు(ts police) విచక్షణారహితంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. గాయాలపాలైన నర్సు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అక్కడేమో మంత్రి, ఇక్కడేమో పోలీసులు మహిళల పట్ల దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల పట్ల సీఎం కేసీఆర్(CM KCR) ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు.

ప్రభుత్వాలపై వ్యతిరేకత

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని ఆమె తెలిపారు. పెట్రోల్‌(petrol cost), డీజిల్(diesel cost) ధరలు తగ్గించాలని కోరుతూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపుతో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని వెల్లడించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే... మన దేశంలో మాత్రం పెరుగుతున్నాయని గీతారెడ్డి ఆరోపించారు. కరోనా(corona)తో ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటే కేంద్రం మాత్రం నిత్యావసర ధరలు పెంచుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చలో రాజ్‌భవన్

పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 12న 33జిల్లాల్లో సైకిల్, ఎండ్ల బండ్లతో నిరసన తెలుపుతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 16న ఇందిరా పార్కు వద్ద భారీ ర్యాలీ, చలో రాజ్‌భవన్ చేపట్టబోతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:Revanth reddy letter to KCR: 2 లక్షలుంటే 50వేలే భర్తీ చేస్తారా?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details