తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్​ పార్టీపై మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు' - పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి

కాంగ్రెస్​ నుంచి ఎన్నో పదవులు అనుభవించి ఇప్పుడు అదే పార్టీని విమర్శించడం కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డికి సరికాదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. హస్తం పార్టీ మునిగిపోయే నావ అన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరాలని డిమాండ్​ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

మల్లురవి

By

Published : Jun 25, 2019, 9:53 PM IST

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డికి కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. హైదరాబాద్​ గాంధీభవన్​లో మాట్లాడిన ఆయన... హస్తం పార్టీ మునిగిపోయే నావ లాంటిదన్న రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. పార్టీ మారిన ఎందరో కనుమరుగయ్యారని ఆయనకు అదే గతి పడుతుందన్నారు. కాంగ్రెస్​ కార్యకర్తలెవరూ భయపడాల్సిన పని లేదని... తాము అండగా ఉంటామని తెలిపారు. రాజగోపాల్​రెడ్డికి ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరాలని డిమాండ్​ చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాజగోపాల్​ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్న పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి

ABOUT THE AUTHOR

...view details