తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస, భాజపా రెండూ ప్రజా వ్యతిరేక పార్టీలే: ఉత్తమ్ - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

తెరాస, భాజపాలు రెండూ ప్రజా వ్యతిరేక పార్టీలేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ ఆరోపించారు. తన పేరుతో వస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వారు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

tpcc uttam kumar reactions on bjp trs
తెరాస, భాజపా రెండూ ప్రజా వ్యతిరేక పార్టీలే: ఉత్తమ్

By

Published : Dec 1, 2020, 2:02 PM IST

తెరాస, భాజపాలు సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. తన పేరుతో సంచలన వ్యాఖ్యలు అంటూ... తెరాస చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. తెరాస, భాజపాలకు కాంగ్రెస్‌ కార్యకర్తలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస రెండూ ప్రజా వ్యతిరేక పార్టీలేనని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్న ఆయన... తెరాసకు ఓటెయ్యమని తాను అన్నట్టు వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రజలకు వారు ఏమి చేయకుండా కాలం గడుపుతున్నారని ఓ ప్రకటనలో ఆరోపించారు.

ఇదీ చదవండి:పోలింగ్ కేంద్రంలో మాస్క్‌ రగడ..భాజపా, తెరాస శ్రేణుల మధ్య గొడవ

ABOUT THE AUTHOR

...view details