లాక్‌డౌన్ కాలంలో ప్రజలనడ్డి విరిచేవిధంగా విద్యుత్ శాఖ బిల్లులు ఇస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ ఆరోపించారు. నిరుపేద, మధ్యతరగతి ప్రజలు అర్థికంగా ఇబ్బంది పడుతున్నారని.... ఈ నేపథ్యంలో మూడు నెలల కరెంట్ బిల్లులు ఒకేసారి లెక్కించడం సరికాదన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులను వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల తరఫున కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలిపారు.
'సామాన్యుడి నడ్డివిరిచేలా కరెంట్ బిల్లులు' - latest news on electricity bills in telangana
మూడు నెలలకు సంబంధించిన కరెంట్ బిల్లు ఒకేసారి ఇవ్వడం వల్ల సామాన్య ప్రజలు అందోళనకు గురవుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సామాన్యుడి నడ్డివిరిచేలా ఈ కరెంట్ బిల్లులు
మూడు నెలల బిల్లులు ఒకేసారి తీయడం వల్ల వినియోగ యూనిట్లు పెరిగి బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. ఫలితంగా ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందిలో ఉన్న ప్రజలమీద అధిక భారం పడుతోందని తెలిపారు. కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వమే ప్రజలను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూండండి:కేసీఆర్, కేటీఆర్‌పై విపక్షాలు చెప్పేవన్నీ అవాస్తవాలే: పోసాని