తెలంగాణ

telangana

ETV Bharat / state

మత సామరస్యానికి లాల్‌దర్వాజ బోనాలు ప్రతీక: రేవంత్‌రెడ్డి - తెలంగాణ వార్తలు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తలపించేలా హైదరాబాద్‌లో బోనాల(bonalu) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) దర్శించుకున్నారు.

lal darwaza bonalu, revanth reddy
లాల్‌దర్వాజా బోనాలు, రేవంత్ రెడ్డి

By

Published : Aug 1, 2021, 12:10 PM IST

Updated : Aug 1, 2021, 2:46 PM IST

హైదరాబాద్‌లో బోనాల(bonalu) ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని లాల్‌దర్వాజ(lal darwaza bonalu) సింహవాహినీ మహంకాళి మందిరం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు(tpcc chief) రేవంత్‌రెడ్డి(revanth reddy) దర్శించుకున్నారు. మత సామరస్యానికి లాల్‌దర్వాజ బోనాలు ప్రతీక అని అన్నారు. బోనం ఎత్తిన ఆడబిడ్డలందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

మత సామరస్యానికి లాల్‌దర్వాజ బోనాలు ప్రతీక. బోనం ఎత్తిన ఆడబిడ్డలందరికి పండుగ శుభాకాంక్షలు. నిజాం పాలనలో హైదరాబాద్‌లో కలరా వచ్చినప్పుడు నవాబు అమ్మవారికి మొక్కుకొని బంగారు ముక్కు పుడక సమర్పించుకున్నారు. కరోనా నుంచి ప్రజల్ని కాపాడడానికి అమ్మవారి ఆశీర్వాదం కావాలి. ఈ పండుగను హిందూ, ముస్లింలు కలిసి జరుపుకుని... హైదరాబాద్ అంటే సర్వమత సమ్మేళనంగా కలసి ఉన్నామని ప్రపంచానికి చాటి చెప్పాలి. హైదరాబాద్‌కి వరదలు వచ్చినప్పుడు నిజాం నవాబు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. పాతబస్తీ ప్రజలకు అమ్మవారి ఆశీర్వాదం కావాలి.

-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి

లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళిని అంజన్‌కుమార్ యాదవ్, భాజపా నాయకురాలు విజయశాంతి దర్శించుకున్నారు. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహినీ మహంకాళి మందిరంతో పాటు చందూలాల్ బేలలోని మాతేశ్వరి ఆలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, శాలిబండ, ఉప్పుగూడ, చంద్రాయణగుట్ట, మీరాలం మండి, గౌలిగూడ ప్రాంతాల్లోని ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:Lal Darwaza Bonalu: వైభవంగా లాల్ దర్వాజ బోనాలు

Last Updated : Aug 1, 2021, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details