తెలంగాణ

telangana

ETV Bharat / state

revanth reddy tweet: భాజపాను ప్రధాన ప్రతిపక్షంగా చూపేందుకే డ్రామాలు: రేవంత్‌ - టీపీసీసీ రెేవంత్ రెడ్డి

revanth reddy tweet: రాష్ట్రంలో తెరాస, భాజపా నాటకం మొదలైందని టీపీసీసీ రెేవంత్ రెడ్డి ట్వీట్​ చేశారు. భాజపాను ప్రధాన ప్రతిపక్షంగా చూపే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. బండి సంజయ్‌ అరెస్టుతో రాజకీయ నాటకం మొదలైందని ఎద్దేవా చేశారు.

revanth reddy tweet
టీపీసీసీ రెేవంత్ రెడ్డి ట్వీట్​

By

Published : Jan 4, 2022, 5:47 PM IST

revanth reddy tweet: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అరెస్టుతో సరికొత్త రాజకీయ నాటకం మొదలైందని టీపీసీసీ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ అరెస్టు అనంతర పరిణామాలపై రేవంత్‌రెడ్డి ట్వీట్టర్​ వేదికంగా స్పందించారు.

Revanth reddy on bandi sanjay arrest: బండి సంజయ్‌ అరెస్టు నాటకం పార్ట్‌-1 గా రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నాటకం పార్ట్‌-2లో భాగంగా జేపీ నడ్డాను కస్టడీకి తీసుకుంటారని తెలిపారు. ఇదంతా భాజపాను ప్రధాన ప్రతిపక్షంగా చూపేందుకేనని రేవంత్‌ ఆరోపించారు. తాను తెరాస, భాజపా ఆడుతున్న నాటకాన్ని బయటపెడుతున్నానని పేర్కొన్నారు. ఇక ఏం జరగబోతుందో ప్రజలే చూస్తారని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details