తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth tweet: ఆ జీవో చెల్లదు.. అందుకోసమే కొత్త డ్రామా: రేవంత్ రెడ్డి - జీవో నెంబర్ 111

Revanth tweet: రాష్ట్ర ప్రభుత్వం 111 జీవో ఎత్తివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ మాఫియా కోసమే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.

tpcc revanth reddy
టీపీసీసీ రేవంత్ రెడ్డి

By

Published : Apr 21, 2022, 3:45 PM IST

Revanth tweet: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 69 చెల్లదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఎత్తివేసిన 111 జీవోపై కోర్టు స్టే విధించిందని తెలిపారు. ఈ జీవోపై విధించిన స్టే ఆర్డర్‌ను ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏలాంటి చర్యలు వద్దని 111 జీవోపై 2007 జులై 16న హైకోర్టు స్టే విధించిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ మాఫియా కోసమే 111 జీవో రద్దు డ్రామా ఆడుతున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

పరివాహ ప్రాంతాన్ని పది కిలోమీటర్ల నుంచి 500 మీటర్లకు తగ్గించాలని కోరడంపై హైకోర్టు స్టే విధించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన జీవో 69 చెల్లదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ మాఫియా కోసమే 111జీవో రద్దు డ్రామా ఆడుతున్నారని టీపీసీసీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కాగా ఇటీవల హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల క్యాచ్ మెంట్ ప్రాంతంలోని గ్రామాల్లో 111 జీవో ద్వారా విధించిన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆంక్షలు ఎత్తివేసిన సర్కార్... జంట జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని షరతు విధించింది.

ఇదీ చూడండి:జీవో 111లోని ఆంక్షల ఎత్తివేతతో... భూముల ధరలకు రెక్కలే!

ABOUT THE AUTHOR

...view details