తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం అప్రమత్తంగా లేకుంటే పెను విపత్తు: రేవంత్‌ రెడ్డి - రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను విపత్తు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ట్విటర్​ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు.

Revanth Reddy
రేవంత్‌ రెడ్డి

By

Published : Jul 13, 2022, 4:43 PM IST

Revanth Reddy: ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను విపత్తు జరిగే ప్రమాదముందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తక్షణమే సీఎం కేసీఆర్‌ సంబంధిత శాఖలతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. కడెం ప్రాజెక్టు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రేవంత్‌ సూచించారు.

ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు 17 మంది మంత్రులను కేటాయించాలన్నారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు సాగు, తాగునీటి శాఖలు, వైద్య, విద్యుత్తు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఏ ప్రమాదం జరిగినా, చిన్నపాటి నష్టం వాటిల్లినా దానికి స్వయంగా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని రేవంత్‌ అన్నారు.

ప్రభుత్వంపై వైఫల్యాలపై ట్వీట్ల వర్షం..

సగం నెలవుతున్నా జీతాలేవీ?:ఉద్యోగులకు జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రేవంత్​ రెడ్డి ట్వీట్ చేశారు. సగం నెల కావొస్తున్నా సగానికి పైగా జిల్లాల ఉద్యోగులకు జీతాలివ్వలేదని ఆరోపించారు. ఉద్యోగులకు వంతుల వారిగా జీతాలివ్వడం చరిత్రలో ఎన్నడు లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని రేవంత్ ప్రశ్నించారు.

సగం నెలవుతున్నా జీతాలేవీ?

ప్రశ్నించకపోతే అజ్ఞానాంధకారమే:రాష్ట్రంలో పేద పిల్లల చదువులకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉపాధ్యాయులు, పాఠ్య పుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన ఊరు - మన బడి కార్యక్రమం’ ఓ ప్రచారార్భాటం తప్ప విద్యార్థులకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయమని రేవంత్ ట్వీట్​ చేశారు.

ప్రశ్నించకపోతే అజ్ఞానాంధకారమే

ఇవీ చదవండి:తెలంగాణలో మరో 3 రోజులు విద్యాసంస్థలు బంద్‌

"మన ఊరు- మన బడి" మరో టెండర్‌ రద్దు.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

కొవిడ్ టీకా ప్రికాషన్​ డోస్ ఇక ఫ్రీ.. వారికి మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details