తెలంగాణ

telangana

ETV Bharat / state

CONGRESS DHARNA: ప్రభుత్వ వైఖరి వల్లే డిస్కంలు దివాళా తీశాయి: రేవంత్ రెడ్డి - విద్యుత్ సౌధ ముందు ఆందోళన

CONGRESS DHARNA: కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు. విద్యుత్ సౌధ, పౌర సరఫరాలశాఖ కార్యాలయాల ముందు ధర్నాకు దిగారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ అందోళనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి, భట్టివిక్రమార్కతో పాటు కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

CONGRESS DHARNA
కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతల ఆందోళన

By

Published : Apr 7, 2022, 3:54 PM IST

Updated : Apr 7, 2022, 4:15 PM IST

CONGRESS DHARNA: విద్యుత్ సౌధ, పౌర సరఫరాలశాఖ కార్యాలయాలను ముట్టడించేందుకు కాంగ్రెస్‌ నాయకులు కదం తొక్కారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్​లోని విద్యుత్​ సౌధ ముందు చేపట్టిన ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ నేతలు శ్రీధర్‌బాబు, జీవన్‌ రెడ్డి, మధు యాస్కీ, మల్లు రవి పాల్గొన్నారు. విద్యుత్‌ సౌధ ముందు రోడ్డుపై కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. సీఎండీతో మాట్లాడేందుకు విద్యుత్ సౌధలోకి 8 మందిని మాత్రమే పోలీసులు అనుమతించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అధికారులకు కాంగ్రెస్‌ నేతల విజ్ఞప్తి చేశారు. అటు కేంద్రం ఇష్టారీతిన పెంచిన పెట్రోల్‌,డీజీల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

డిస్కంల అప్పులను ప్రభుత్వం చెల్లించకపోవటం వల్లే ఇవాళ దివాళ తీశాయి. వాస్తవాలను వారు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. సీఎండీపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది. సీఎండీతో మాట్లాడుతుంటే మఫ్టీలో ఉన్న పోలీసులు వీడియో తీస్తున్నరు. సీఎండీపై నిఘా ఉంచడంతో ఆయన చెప్పాలన్నది కూడా చెప్పలేకపోయారు. చివరికి ప్రభుత్వం పోలీసులతో బెదిరించి పాలన చేయలనుకుంటున్నది. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. నిపుణులతో చర్చించి న్యాయస్థానం తలుపు తడతాం. - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంపును నిరసిస్తూ టీపీసీసీ రేవంత్​ రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసం ముందు భారీగా మోహరించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్భందం చేశారు. కీలక నేతలందరినీ ముందస్తుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చివరకు నిరసనకు అనుమతి ఇవ్వడంతో.. రేవంత్ రెడ్డి విద్యుత్ సౌధ ముందు ధర్నాకు దిగారు.

ప్రభుత్వ వైఖరి వల్లే డిస్కంలు దివాళా తీశాయి: రేవంత్ రెడ్డి

ఇవీ చూడండి:విద్యుత్ సౌధ ముట్టడికి మహిళా కాంగ్రెస్ ప్రయత్నం

Tollywood drugs Case: సీఎస్, ఎక్సైజ్ డైరెక్టర్​కు హైకోర్టు నోటీసులు

Last Updated : Apr 7, 2022, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details