Revnath reddy on KCR: కేసీఆర్ కుటుంబం ఆస్తుల విలువ నిజాం నవాబుల సంపదను మించిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి అవధులు లేకుండా పోయానన్న రేవంత్... యాదాద్రి ఆలయ నిర్మాణంలో కూడా ముఖ్యమంత్రి కుటుంబ అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ప్రజా గాయకుడు గద్దర్ గాంధీ కుటుంబంపై రూపొందించిన రైతు సంఘర్షణ సభ దృశ్య కావ్యాన్ని కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రారంభించారు.
కేసీఆర్, మోదీ కలిసి రాజకీయ క్షేత్రాన్ని దోచుకునేందుకు వాడుకుంటున్నరు. ఎవరిమీద ఎవరు ఆధారపడకండి. ఒక పూట తినకుండానైనా రాహుల్ గాంధీ సభకు రండి. రైతుల ఇళ్ల నుంచి సభకు కదలిరండి. తెలంగాణ బిడ్డల నమ్మకమైన యాదాద్రిలో అవినీతి చీడ కనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబం అవినీతికి స్వామివారు కూడా బలైపోయిండు. 1200 మంది త్యాగాల మీద ఏర్పడ్డ స్మారక స్థూపానికి 200 కోట్లు కేటాయించిన పూర్తి కాలేదు. నిజాం వారసుల సంపద కంటే కేసీఆర్ కుటుంబం సిరి సంపదలతో తూలతూగుతోంది. ప్రజలంతా రాహుల్ సభకు తరలివస్తే కేసీఆర్‌ను గద్దె దించుతాం.