కేంద్రం ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్‌తో దిల్లీలో భేటీ అయిన రేవంత్... రేపు జరగబోయే రాజ్‌భవన్ ముట్టడికి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కాంగ్రెస్‌లో చేరనున్న సామ వెంకట్ రెడ్డి
రాష్ట్ర కనీస వేతనాల బోర్డు ఛైర్మన్, అధ్యక్షుడు సామ వెంకట్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫోన్ల ట్యాపింగ్‌కు నిరసనగా రేపు రాజ్‌భవన్ ముట్టడి చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తామని వెల్లడించారు. జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారు.
కేసీఆర్ విశ్వాసం కోల్పోయారు
రాష్టంలో కేసీఆర్ పాలన చూసి ఉద్యమకారులు విసుగు చెందుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని అన్నారు. తెలంగాణ ప్రజలు తెరాసను నమ్మే పరిస్థితి లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసిందని విమర్శించారు. ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి లభించడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారిని తెరాస పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. తెరాస ప్రభుత్వాన్ని ఉద్యమకారులు తిరస్కరిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రతిపక్షాల ఫోన్లను ట్యాపింగ్ చేయడం దుర్మార్గమైన చర్య. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరుతున్నాం. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా కేంద్రం వ్యవహరించింది. ఫోన్ల ట్యాపింగ్‌ను వ్యతిరేకిస్తూ రేపు రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత పెరిగింది. ప్రజల్లో తెరాస పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. ప్రస్తుతం తెరాసను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. అందువల్ల కాంగ్రెస్ నాయకులు పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని కోరుతున్నా.- రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
తెలంగాణ ఉద్యమంలో పోరాడిన యువతకు ఉద్యోగాలు కల్పించలేదు. ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించాలని పోరాడాం. కేసీఆర్ నాయకత్వంలో న్యాయం జరుగుతుందని కలిసికట్టుగా ఉద్యమంలో పాల్గొన్నాం. రాష్ట్రం వచ్చాక కూడా స్థానికులకు ఉద్యోగాలు రాలేదు. యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైనందున తాము కాంగ్రెస్‌లో చేరుతున్నాం- సామ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల బోర్డు ఛైర్మన్
ఇవీ చూడండి: