Revanth On Cm Kcr: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు ఇష్టమున్నట్లు పెంచుతున్నారని...అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రం తగ్గించలేదని దుయ్యబట్టారు. వరదల వల్ల 1400కోట్లు నష్టం జరిగిందని చెబుతున్న ప్రభుత్వం స్పష్టమైన అంచనా వేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ వారం రోజులు దిల్లీలో ఉన్నా నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. చికోటి ప్రవీణ్ వెనుక ఉన్న చీకటి మిత్రులు ఎవరనేది బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఈ విషయంలో ప్రభుత్వం జుడిషియల్ విచారణకు ఆదేశించాలన్నారు. ఎమ్మెల్యేకు సంబంధించిన స్టిక్కర్ పారేశానని బాధ్యతారాహిత్యంగా వ్యవహారించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అసిఫాబాద్ నియోజకవర్గ ఆదివాసీ నాయకురాలు, మాజీ మంత్రి భీమ్‌రావ్ కూతురు ముర్సుకొల సరస్వతి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
మునుగోడు ఎమ్మెల్యే ‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలో బాధ్యత అంతా ఉత్తమ్ తీసుకున్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన మునుగోడును కాపాడుకుంటాం. నల్గొండ జిల్లాలో ఉత్తమ్, కోమటిరెడ్డి వంటి బలమైన నేతలు ఉన్నారు. ఏదైనా ఉపద్రవం వస్తే కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండి కాపాడుకుంటుంది’- రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్