తెలంగాణ

telangana

ETV Bharat / state

'నెహ్రూ చేసిన త్యాగాలు ప్రజలకు వివరించాలి' - క్విట్​ ఇండియా ఉద్యమం

దేశ సేవలో నిరంతరం శ్రమించిన వ్యక్తి నెహ్రూను భాజపా తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ ఆరోపించారు. చాచా త్యాగాలను ప్రజలకు వివరించాలని అన్నారు. చరిత్రను వక్రీకరించి కమలం పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నట్లు విమర్శించారు. క్విట్​ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ గాంధీభవన్​లో కాంగ్రెస్​ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఉత్తమ్​కుమార్​

By

Published : Aug 9, 2019, 3:25 PM IST

దేశం కోసం నెహ్రూ చేసిన త్యాగాలు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ అభిప్రాయపడ్డారు. క్విట్​ ఇండియా దినోత్సవం సందర్భంగా గాందీభవన్​లో కాంగ్రెస్​ పార్టీ జెండాను ఆవిష్కరించారు. గాంధీ, నెహ్రూ త్యాగాలను భాజపా తక్కువ చేసి చూపాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. చరిత్రను తప్పుగా చూపి... రాజకీయ లబ్ధి పొందాలని చూడడం కమలం పార్టీకి సిగ్గుచేటని ధ్వజమెత్తారు. స్వయంగా హోమంత్రి పార్లమెంట్​లో నెహ్రూను విమర్శిస్తూ మాట్లాడడం తగదని అన్నారు. ఈనెల 20 రాజీవ్​ గాంధీ 75వ జయంతి వేడుకలు గ్రామగ్రామాన పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​రెడ్డి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు పాల్గొన్నారు.

గాంధీభవన్​లో క్విట్​ ఇండియా సంబురాలు

ABOUT THE AUTHOR

...view details