రెండు, మూడు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌కు సారథిని నియమించనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో సంస్థాగత అంశాలపై ఏఐసీసీ దృష్టి సారించింది. వివిధ రాష్ట్రాల్లో నాయకుల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి సీనియర్ నేతలను రంగంలోకి దింపింది. 2022లో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఖాళీగా ఉన్న పీసీసీ అధ్యక్ష, కార్యవర్గాల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది.
PCC President: రెండు, మూడు రోజుల్లో టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన! - TPCC President's announcement latest news
రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతోన్న పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు రెండు, మూడు రోజుల్లో తెరపడనుంది. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథిని నియమించే దిశగా ఏఐసీసీ చర్యలను ముమ్మరం చేసింది.
![PCC President: రెండు, మూడు రోజుల్లో టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన! టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11995896-496-11995896-1622681683226.jpg)
టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన
తెలంగాణ పీసీసీ సారథ్యంపై గతంలోనే ఏఐసీసీ అభిప్రాయ సేకరణ జరిపింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ముందు దీనిపై ప్రకటన చేయొద్దని మాజీ మంత్రి జానారెడ్డి కోరడంతో అప్పుడు వాయిదా పడింది. ప్రస్తుతం ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో సారథిని ప్రకటించే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: Eetala Resign: తెరాస, ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల రాజీనామా!
Last Updated : Jun 3, 2021, 7:28 AM IST