రేషన్‌కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న 18లక్షల మందికీ రేషన్, నగదు ఇవ్వాలిని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ ఏమైందని ప్రశ్నించారు.
బియ్యం, నగదు పంపిణీలో పారదర్శకత లేదు: ఉత్తమ్ - సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ
రాష్ట్రంలో లాక్నడౌన్ నేపథ్యంలో సర్కారు చేపట్టిన ఉచిత బియ్యం, నగదు పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరగడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ కమిటీ తరఫున ఆయన బహిరంగ లేఖ రాశారు.
TPCC TASK FORCE COMMITTEE latest news
సాంకేతిక కారణాలతో 13.42లక్షల మంది రేషన్‌కార్డుదారులకు నగదు అందలేదని తెలిపారు. అలాగే ఉజ్వల పథకం కింద ఇస్తామన్న గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా జరగలేదన్నారు. దీపం పథకం లబ్ధిదారులకు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ఉత్తమ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.