తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రశ్నించే గొంతు కోసం రాములు నాయక్​ను గెలిపించండి' - Tpcc news

శాసనమండలిలో ప్రశ్నించే గొంతు వినిపించాలంటే రాములు నాయక్​ను గెలిపించాలని కోరారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.

'ప్రశ్నించే గొంతు కోసం రాములు నాయక్​ను గెలిపించండి'
'ప్రశ్నించే గొంతు కోసం రాములు నాయక్​ను గెలిపించండి'

By

Published : Mar 2, 2021, 9:23 PM IST

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్​ను గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి సూచించారు. సోషల్ మీడియా వేదికగా పట్టభద్రులను కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పేర్కొన్నారు. తెరాస, భాజపా.. ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగ సమస్యపై ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు.

రాములు నాయక్.. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి అని చేప్పారు. పట్టభద్రులు, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని ఉత్తమ్ సూచించారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతు వినిపించాలంటే రాములు నాయక్​ను గెలిపించాలన్నారు.

ఇదీ చదవండి: మూడుసార్లు ఎమ్మెల్యే.. అయినా ఇల్లు లేదు

ABOUT THE AUTHOR

...view details