దేశవ్యాప్తంగా ఈనెల 8న జరగనున్న భారత్ బంద్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలపై దేశంలో వివిధ రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం చారిత్రాత్మకమని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ... ఏ మాత్రం రాజీలేకుండా పట్టుదలతో రైతు వ్యతిరేక చట్టాలపై ఉద్యమం చేయడం హర్షనీయమని కొనియాడారు.
పోలీసుల సహాయంతో అణచివేయాలని చూసినా... లెక్కచేయకుండా ఎదురొడ్డి తమ ఉద్యమాన్ని కొనిసాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల, బయట కూడా ఆందోళనలు చేసినట్లు తెలిపారు.