రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించిన మేరకు ఫిట్ మెంట్‌తో కూడిన నూతన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం వారికి అందాల్సిన ఆర్థిక పరమైన లబ్ధి విషయంలో తాత్సారం చేయడం తగదని సీఎం కేసీఆర్‌కు లేఖలో సూచించారు. జులై 1, 2018 నుంచి రావాల్సిన 11వ పీఆర్సీ 20 నెలలు గడుస్తున్నా ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ బహిరంగ లేఖ - తెలంగా
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నూతన పీఆర్సీ వెంటనే అమలు చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు.
TPCC President Uttam Kumar reddy respond by PRC issue
పీఆర్సీపై ఏర్పాటైన కమిటీ కాలపరిమితిని పొడిగించటం సమంజసం కాదని ఉత్తమ్ పేర్కొన్నారు. కమిటీ పొడిగింపునకు గల కారణాలను ప్రజాబాహుల్యంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కనీసం ఉద్యోగుల కోసం మధ్యంతర భృతి - ఐఆర్ అయినా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, సర్వీస్ నిబంధనల రూపకల్పన, ఈహెచ్ఎస్ బకాయిలు వంటి ఉద్యోగుల సమస్యలపై వెంటనే చొరవ తీసుకోవాలన్నారు.
ఇవీ చూడండి:79 కళాశాలలకు ఇంటర్ బోర్డ్ నోటీసులు