రైతులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు, కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలుకు అనుమతి ఇచ్చిందన్నారు.
ఇది రైతులు, కాంగ్రెస్ పార్టీ విజయం: ఉత్తమ్ - మక్కల కొనుగోలు నిర్ణయంపై ఉత్తమ్ వ్యాఖ్యలు
మొక్కజొన్న రైతులు, కాంగ్రెస్ పార్టీ పోరాటాల ఫలితంగానే.... ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లకు అనుమతి ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇది రైతులు, కాంగ్రెస్ పార్టీ విజయమని పేర్కొన్నారు.
జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో మొక్కజొన్న రైతులు పెద్దఎత్తున పోరాటం చేశారన్న ఉత్తమ్... వీటికి కాంగ్రెస్ శ్రేణులు మద్దతుగా నిలిచారని వివరించారు. మక్కల కొనుగోలుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రికి లేఖ కూడ రాశామని గుర్తుచేశారు. ఈ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయన్న ఆయన... పాడైన పంటలకు కూడా మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:'వరద బాధితుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయాలి'