'ఆర్టీసీ మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయండి' - Congress party support to RTC million march
ఆర్టీసీ ఐకాస రేపు తలపెట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ తమ మద్దతు కోరినట్లు ఆయన వెల్లడించారు.
TPCC President said Congress party support to RTC million march
ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. నెల రోజులకు పైగా ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నా... సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. మిలియన్‌మార్చ్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు ఇవ్వాలని కోరారు.