తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth: 'ఓఆర్‌ఆర్'పై రూ.15 వేల కోట్లు ఇప్పిస్తా.. ప్రభుత్వానికి రేవంత్​ ఓపెన్ ఆఫర్ - సీఎం కేసీఆర్​పై రేవంత్​రెడ్డి ఫైర్

Revanthreddy on ORR Toll Tender Issue: రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్​ఆర్​ను ముఖ్యమంత్రి కుటుంబం పల్లీ బఠాణీల మాదిరి అమ్ముకుంటుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. విశాఖ ఉక్కును కాపాడతామని బీరాలు పలుకుతున్న సీఎం కేసీఆర్.. ప్రజల ఆస్తిని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. గ్రోత్‌ కారిడార్‌ పరిధిలో ఉన్న ఓఆర్​ఆర్​ను హెచ్​ఎండీఏ కిందకు మార్చడంలో ఉన్న మతలబును బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Revanthreddy
Revanthreddy

By

Published : May 4, 2023, 6:35 PM IST

Revanthreddy on ORR Toll Tender Issue: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు టెండర్ల విషయంలో రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. మరోసారి ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌ అంశంపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖ మంత్రిదని... అయితే తాను ఇరుక్కుపోతాననే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ ముఖం చాటేశారని ఆక్షేపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. హెచ్​ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్‌ తాము లేవనెత్తిన ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు.

రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను తక్కువకు అమ్ముకున్నారు:రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్​ఆర్​ను ముఖ్యమంత్రి కుటుంబం పల్లీ బఠాణీల మాదిరి అమ్ముకుంటుందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. విశాఖ ఉక్కును కాపాడతామని బీరాలు పలుకుతున్న సీఎం కేసీఆర్.. ప్రజల ఆస్తిని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. గ్రోత్‌ కారిడార్‌ పరిధిలో ఉన్న ఓఆర్​ఆర్​ను హెచ్​ఎండీఏ కిందకు మార్చడంలో ఉన్న మతలబును బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ముందు ఐఆర్​బీ కంపెనీకి కట్టబెట్టి.. అనంతరం మంత్రి కేటీఆర్ బినామీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎన్​హెచ్​ఏఐ నిబంధనల ప్రకారం టెండర్లు ఇవ్వలేదన్న రేవంత్‌.. దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్​రోడ్డు ఆదాయాన్ని 30 ఏళ్లకు తనఖా పెట్టి.. బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు 48 గంటల్లో రుణం ఇప్పిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నానన్న ఆయన.. ప్రభుత్వం ఈ స్విస్ ఛాలెంజ్​కు సిద్ధమా అని సవాల్​ విసిరారు.

'ఓఆర్ఆర్‌ వివాదంపై సంబంధిత మంత్రి స్పందించలేదు. అధికారి అర్వింద్‌ కుమార్‌ వివరణ సంతృప్తికరంగా లేదు. ప్రముఖ సంస్థ నివేదిక ఆధారంగా టెండర్‌ పిలిచామని చెప్పారు. నివేదిక ఇచ్చిన సదరు సంస్థ చరిత్ర సక్రమంగా లేదు. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై అప్పుల భారం లేదు. ఔటర్‌ రింగ్‌రోడ్డును ప్రైవేటుకు ఎందుకు అమ్ముతున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ మారినప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎన్‌హెచ్‌ఏఐ చెప్పింది. ఎన్‌హెచ్‌ఏఐ ఇచ్చిన నివేదిక ప్రకారం 2031 వరకు అనుమతి ఉంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం తక్కువ ధరకు టెండర్లు ఇస్తుంది. ఔటర్ రింగ్​ రోడ్డు ఆదాయాన్ని 30 ఏళ్లకు తనఖా పెట్టి.. బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు 48 గంటల్లో రుణం ఇప్పిస్తా. కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. ప్రభుత్వం ఈ స్విస్ ఛాలెంజ్​కు సిద్ధమా'-రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఓఆర్‌ఆర్‌ కుంభకోణంలో మంత్రి KTR, ముఖ్యమంత్రి పాత్ర ఉంది: రేవంత్‌ రెడ్డి

ఓఆర్‌ఆర్‌ అంశంపై కాగ్‌కు ఫిర్యాదు చేస్తాం:ఆర్టీఐ ప్రకారం అడిగిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదని రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఓఆర్‌ఆర్ టెండర్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆస్తుల్ని కేసీఆర్ ప్రైవేటుకు అమ్మడానికి వీల్లేదన్న ఆయన.. రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను అగ్గువకే కట్టబెడుతున్నారని ఆక్షేపించారు. ఈ విషయంలో స్టేట్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్, డీవోపీటీకు అరవింద్‌కుమార్‌పై ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్‌ అంశంపై కాగ్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

'ఓఆర్​ఆర్ విషయంలో బేస్ ప్రైస్ పెట్టాం కానీ చెప్పం అని అంటున్నారు. అందులో ఏమైనా దేశ భద్రత, కేసీఆర్ ప్రాణం ఏమైనా ఉందా? బేస్ ప్రైస్ చెప్పడానికి ఏమిటి నష్టం. అరవింద్ కుమార్ మేం లేవనెత్తిన ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పలేదు. సీబీఐ, ఈడీకి కూడా సమాధానం ఇవ్వరా? తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలి. ఇంత జరుగుతున్నా తండ్రీ కుమారులు బయటకు వచ్చి వివరణ ఇవ్వడం లేదు. తెలంగాణ కేబినెట్​కు అతీత శక్తులు లేవు. కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదు.'-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details