Revanth Reddy comments on bjp: తుక్కుగూడలో భాజపా నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల తరఫున తాము అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమే చెప్పలేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై ఆర్భాటపు ప్రకటనలు మాత్రమే చేస్తున్నారని అన్నారు. అవినీతిపై ఆచరణ చర్యలు ఉండవని తేలిపోయిందన్నారు. ‘అంతేలే షా జీ… మీ చీకటి మిత్రుడిపై ఈగ వాలనివ్వరుగా!’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
'అంతేలే షా జీ.. మీ చీకటి మిత్రుడిపై ఈగ వాలనివ్వరుగా' - అమిత్ షా తాజా వార్తలు
Revanth Reddy comments on bjp: తుక్కుగూడలో భాజపా నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి