తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth reddy Phone call: వీణవంక బాధితురాలికి రేవంత్ రెడ్డి ఫోన్... ఏం చెప్పారో తెలుసా! - హైదరాబాద్​ జిల్లా వార్తలు

నిరుద్యోగ సమస్యలపై మాట్లాడటానికి వెళ్తే... పోలీసులు తనపై దాడి చేయడంతోపాటు దుర్భాషలాడరని ఆరోపిస్తున్న మహిళతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, భయపడవద్దని భరోసా ఇచ్చారు.

Revanth reddy Phone call
Revanth reddy Phone call

By

Published : Oct 19, 2021, 2:18 PM IST

వీణవంక బాధితురాలికి ఫోన్​ చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

పోలీసులు తనపై దాడి చేయడంతోపాటు దుర్భాషలాడరని ఆరోపిస్తున్న మహిళతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్​లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని కోరారు. మంగళవారం రోజు ఆ మహిళను హైదరాబాద్​కు రావల్సిందిగా చెప్పిన రేవంత్ రెడ్డి... ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేయడానికి తను కూడా వస్తానని తెలిపారు.

తెరాస సభకు వెళ్లి... ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని, ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆడిగినందుకే తనపై పోలీసులు దాడి చేశారని ఆ మహిళ రేవంత్ రెడ్డికి వివరించింది. పోలీస్​ స్టేషన్​కి తీసుకెళ్లి నోటికొచ్చినట్లు మహిళా పోలీసులు దుర్భాషలాడినట్లు పేర్కొంది.

ఉద్యోగం అడిగితే తెరాస వాళ్లు కొట్టించారు..

కరీంనగర్​ జిల్లా వీణవంక మండలంలో పోలీసులు కేసీఆర్​కు తొత్తులుగా మారారని ఓ యువతి ఆరోపించారు. తాను వీణవంక మండలంలో తెరాస పార్టీ సమావేశానికి వెళ్తే... పోలీసులు తనపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నిరుద్యోగ సమస్యలపై మాట్లాడటానికి వెళ్తే.... తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు. భాజపా తనకు 10 లక్షలు ఇచ్చినట్లు ఆరోపించారని పేర్కొన్నారు.తన దారిన తాను వెళ్తుంటే.. పోలీసులు తనపై దాడికి దిగారని ఆవేదన చెందారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆ యువతి ఆరోపించారు. మెడలో చైన్​ లాగేసుకున్నారని కన్నీరు పెట్టుకున్నారు. నిరుద్యోగ బాధలు ఎవరికి అర్ధం కావడం లేదని విలపించారు.

ఇదీ చదవండి:Police assault on woman: ఉద్యోగం అడిగితే.. తెరాస వాళ్లు కొట్టించారు.. చేతులు, కాళ్లు లాగేసి...

ABOUT THE AUTHOR

...view details