Revanth Reddy Letter To CM KCR: హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ విభాగంలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షల్లో ఏడు ప్రశ్నలను తొలగించి అభ్యర్థులకు న్యాయం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన శనివారం బహిరంగ లేఖ రాశారు. ప్రిలిమినరీ రాత పరీక్షల్లో కానిస్టేబుల్, ఎస్సై ప్రశ్నపత్రాల్లో చెరో ఏడు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్నాయని, దీంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందన్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించి కొందరికి మార్కులు ఇచ్చారని, మరికొందరికి ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనిపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ 7 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించిందన్నారు.
'పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో హైకోర్టు తీర్పు అమలు చేయాలి' - revanth letter KCR si constable preliminary exam
Revanth Reddy Letter To CM KCR : పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో హైకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
Revanth Reddy
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఛైర్మన్ ప్రీతం ఆధ్వర్యంలో శనివారం రాత్రి గాంధీభవన్‌లో క్రిస్‌మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి మహేశ్‌కుమార్‌గౌడ్, చిన్నారెడ్డి, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, చెరుకు సుధాకర్, శివసేనారెడ్డి, సునీతారావు తదితరులు హాజరయ్యారు.