కోకాపేట్, ఖానామెట్ భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని.. వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు దిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశానని రేవంత్ తెలిపారు. రాష్ట్ర ఖజానాకు రూ. వెయ్యి నుంచి 1,500 కోట్ల నష్టం జరిగిందని రేవంత్ ఆరోపించారు.
రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని వివరించామని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకే సీబీఐ విచారణ జరిపించాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అవినీతి సంపదతో ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
కోకాపేట్, ఖానామెట్ భూముల టెండర్లలో గోల్మాల్ జరిగింది. దీనికి సహకరించిన అందరిపైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. భాజపా, తెరాస కుమ్మక్కయ్యాయి అనేది నిజం కాకపోతే.. భూముల అమ్మకాలపై సీబీఐ చేత విచారణ జరిపించి.. చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.