తెలంగాణ

telangana

Revanth reddy: 'స్వార్థ రాజకీయాల కోసం ప్రేమ చూపిస్తున్నారు'

By

Published : Jun 28, 2021, 3:57 PM IST

అణగారిన వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం కేసీఆర్​ స్వార్థ రాజకీయాల కోసం ప్రేమ చూపిస్తున్నారని టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. హైదర్​గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్​ను పరామర్శించారు.

dd
dd

సీఎం కేసీఆర్​పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విమర్శలు

అణగారిన వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం కేసీఆర్​ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విమర్శించారు. అనారోగ్యంతో హైదర్​గూడలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్​ నేత వీహెచ్​ను పరామర్శించారు. ఆయనతో మాట్లాడిన తర్వాత వీహెచ్​ ఆలోచన విధానం పట్ల మరింత గౌరవం పెరిగిందన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా... దళిత ఎంపవర్​మెంట్​ అంటూ సీఎం కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్​లో 125 అడుగుల అంబేడ్కర్​ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి తట్టెడు మట్టికూడా తీయలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​ తీసుకొచ్చి దళితులను, గిరిజనులను ఆర్థికంగా అండగా నిలిచింది కాంగ్రెస్​ పార్టీయేనని రేవంత్ అన్నారు.

రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులన్నింటినీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో చెప్పి ప్రజల తరఫున పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించి సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి... రాబోయే రెండున్నరేళ్లలో క్షేత్రస్థాయిలో ప్రజల తరఫున పోరాడేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేద్దామని వీహెచ్ సూచించారని...అదే ప్రకారం ముందుకు వెళతానని రేవంత్ తెలిపారు.

వీహెచ్​ ఆలోచన విధానం పట్ల మరింత గౌరవం పెరిగింది. దళితుల ఎంపవర్​మెంట్​ పేరుతో సీఎం కేసీఆర్​ మీటింగ్​ పెట్టినట్లు నా దృష్టికి వచ్చింది. పంజాగుట్టలోని అంబేడ్కర్​ విగ్రహాన్ని తీసివేయించింది కేసీఆర్​... 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన భూములను పేదల వద్ దనుంచి గుంజుకుని వారిని నిరాశ్రయులను చేస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి... దళితులకు అన్యాయం చేస్తున్నారు.

- రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇదీ చూడండి:నెక్లెస్ రోడ్‌లో 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details