తెలంగాణ

telangana

ETV Bharat / state

2, 3 రోజుల్లో పీసీసీ అధికార ప్రతినిధులను నియమిస్తాం: రేవంత్‌ - మీడియాతో రేవంత్​ రెడ్డి ఇష్టాగోష్ఠి

revanth reddy
revanth reddy

By

Published : Jul 13, 2021, 5:21 PM IST

Updated : Jul 13, 2021, 6:12 PM IST

17:13 July 13

2, 3 రోజుల్లో పీసీసీ అధికార ప్రతినిధులను నియమిస్తాం: రేవంత్‌

  రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో పీసీసీ అధికార ప్రతినిధులను నియమించనున్నట్లు తెలిపారు. తెదేపా తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్‌.రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి.. కేసీఆర్ తెరాసలోకి తీసుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. 

 ఇవాళ ముగ్గురు నేతలు తమను కలిసి పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారని... అందులో భాజపా ఎంపీ ధర్మపురి అర్​వింద్​ సోదరుడు నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్‌ జిల్లా భాజపా అధ్యక్షుడు ఎర్ర శేఖర్‌ ముదిరాజ్‌, భూపాల్‌పల్లికి చెందిన తెదేపా మాజీ నేత గండ్ర సత్యనారాయణ ఉన్నట్లు వివరించారు. మూడు వర్గాలకు చెందిన నాయకులు పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.  

  కౌశిక్‌ చిన్న పిల్లవాడు.. ఆ మాటలు అతనివి కావు... కేసీఆర్‌ మాట్లాడించినవని రేవంత్​ రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇప్పుడే చెప్పమని స్పష్టం చేశారు. కౌశిక్‌ రెడ్డి తెరాసతో టచ్‌లో ఉన్నట్లు తనకు ముందే తెలుసని చెప్పారు. అక్కడ కౌశిక్‌ రెడ్డికి తెరాస టికెట్ ఇస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. తెరాసకు అభ్యర్థి కరవయ్యాడని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారని ఎద్దేవా చేశారు. నిన్నటి పెట్రోల్‌, డీజిల్‌ పెంపుపై నిరసన కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చినట్లు పేర్కొన్నారు. 

ఇదీ చూడండి:Bhatti: అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం: సీఎల్పీ నేత భట్టి

Last Updated : Jul 13, 2021, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details