Revanth reddy on BC's: కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ... దిల్లీలోని జంతర్‌మంతర్‌లో బీసీ సంఘాలు చేస్తున్న ఆందోళనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కులగణన చేయకపోవడం వల్ల రిజర్వేషన్లు, నిధుల కేటాయింపుల్లో బీసీ వర్గాలు నష్టపోతున్నాయని బీసీ సంఘాన నేతలు అన్నారు. మూడు రోజుల పాటు నిరసనలు, ర్యాలీలు, కేంద్రమంత్రుల నివాసాల ముట్టడి చేస్తామని ప్రకటించారు. భాజపా ఆది నుంచి బీసీ వ్యతిరేక పార్టీ అన్న రేవంత్.... తెరాసకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
Revanth reddy on BC's: 'కుల గణన చేయకపోవడం వల్ల బీసీ వర్గాలు నష్టపోతున్నాయి' - దిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీల ధర్న
Revanth reddy on BC's: బీసీల పట్ల తెరాసకు చిత్తశుద్ధి ఆ పార్టీ నేతలు దిల్లీలో పోరాటం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న దీక్షలో ఆయన పాల్గొన్నారు.
కేసీఆర్‌గారు శాసన సభలో తీర్మానం చేశారు. తీర్మానం నాలుక గీసుకోడానికి కూడా సరిపోదు. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతోంది. పార్లమెంట్లో ప్రశ్నించాల్సిన తెరాస ఎంపీలు పారిపోయారు. పార్లమెంటుకు వస్తారో రారో వారి ఇష్టం. కనీసం జంతర్‌మంతర్ వద్ద దీక్షలో అయినా పాల్గొని ఉండాల్సింది. వాళ్లు పాల్గొనడం లేదంటే... బీసీ కుల జన గణన పట్ల వాళ్లకు పట్టింపు లేదు. అదేవిధంగా మోదీ గారు... మాట్లాడితే ఆయన బీసీ అంటారు. బలహీన వర్గాలకు సంబంధించిన నువ్వే ప్రధానిగా ఉన్నప్పుడు ఈ లెక్కలు తీయడాన్ని నిన్నెవరు ఆపుతున్నారు. నువ్వు ఎవరి చేతిలో కీలుబొమ్మవు. ఇదే బీసీలు నిన్ను ప్రధాన మంత్రిని చేశారు. నిన్ను గద్దె దించడానికి కూడా వెనకాడరు. ఈ మొత్తం పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి:Palla comments: 'కేంద్రంలో వరిధాన్యం కొనే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం'