తెలంగాణ

telangana

ETV Bharat / state

REVANTH REDDY: 'కేసీఆర్​పై ఫిర్యాదు చేస్తాం.. అమిత్​షా అపాయింట్​మెంట్ కావాలి'

సీఎం కేసీఆర్​ అవినీతి పాలనపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్​మెంట్ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. పూర్తి ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

అమిత్ షా
రేవంత్ రెడ్డి

By

Published : Sep 16, 2021, 8:03 PM IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశారు. తనతో పాటు ముగ్గురు ఎంపీలు, సీఎల్పీ నేతతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మొత్తం పది మందికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు.

సీఎం కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నట్లు పూర్తి ఆధారాలతో ఇప్పటికే కేంద్రానికి నివేదించినా ప్రయోజనం లేదని రేవంత్‌ పేర్కొన్నారు. ఈ నెల 17న రాష్ట్రానికి వస్తున్న అమిత్‌ షా.. తమకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ తదితర అనేక అవకతవకలపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టిన ఏడున్నరేళ్లలో ఏమేం అవినీతి, అక్రమాలు జరిగాయో అవన్నీ కూడా అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమకు అపాయింట్​మెంట్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:Ts Assembly session : ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details