తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్యం: ప్రధానిగా రాహుల్​

లోక్​సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభించింది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు కృషి చేస్తున్నామని టీపీసీసీ నేతలు పేర్కొన్నారు.

By

Published : Feb 16, 2019, 6:17 AM IST

Updated : Feb 16, 2019, 11:34 AM IST

సమావేశం

ఒకటే గమణం..గమ్యం
లోక్​సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తీర్మానించారు. మూడు రోజుల పాటు జరిగే టీపీసీసీ పార్లమెంటు ఎన్నికల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్​లో జరిగిన ఈ కార్యక్రమంలో తొలి రోజు ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, కరీంనగర్, వరంగల్ ఎంపీ స్థానాలపై చర్చించారు. సభ ప్రారంభంలో జమ్ముకశ్మీర్​లో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు.

దేశంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి భాజపా పాలన సాగిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా విమర్శించారు. మోదీని ఓడించి.. రాహుల్ గాంధీని ప్రధానిగా ఎన్నుకునేందుకు యావత్ దేశం ఎదురుచూస్తోందని తెలిపారు.

నేడు నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలపై చర్చించనున్నారు. రేపు చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్​, సికింద్రాబాద్, మెదక్ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Last Updated : Feb 16, 2019, 11:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details