తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 12న రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు: టీపీసీసీ - జీహెచ్​ఎంసీ ఎన్నికలపై టీపీసీసీ చర్చ హైదరాబాద్​

రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 12న తెలంగాణ వ్యాప్తంగా రైతు దీక్షలు, ప్రదర్శనలు చేయాలని కాంగ్రెస్‌ కోర్​ కమిటీ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డి నేతృత్వంలో గాంధీభవన్‌లో పీసీసీ కోర్‌ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రైతు సమస్యలు, జీహెచ్​ఎంసీ ఎన్నికలపై చర్చించారు. తక్కువ దిగుబడి వచ్చిన రైతన్నల నుంచి సన్నరకం వడ్లకు రూ.2,500 మద్దతు ధర ఇవ్వాలని టీపీసీసీ డిమాండ్‌ చేసింది.

ఈ నెల 12న రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు: టీపీసీసీ
ఈ నెల 12న రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు: టీపీసీసీ

By

Published : Nov 4, 2020, 7:33 PM IST

తెలంగాణలో రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు, ప్రదర్శనలు చేయాలని పీసీసీ కోర్‌ కమిటీ నిర్ణయించింది. కోర్‌ కమిటీ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్​ గాంధీభవన్‌లో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలో పీసీసీ కోర్‌ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, చిన్నా రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్‌ కృష్ణణ్‌, బోసురాజు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించిన కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ పరిధిలో జనాభా ఆధారంగా 50 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ నెల 7న మహిళలు, ఎస్టీలపై దాడులకు నిరసనగా ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 11న ఖమ్మంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ట్రాక్టర్లతో రైతు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు దరఖాస్తుతోపాటు రూ.10 వేల రుసుం పార్టీకి ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో తక్కువ దిగుబడి వచ్చిన రైతన్నల నుంచి సన్నరకం వడ్లకు రూ.2,500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతు సమస్యలపై శాశ్వత పరిష్కారానికి ఉద్దేశించి, సమస్యలపై పోరాటం చేసేందుకు శాశ్వత కమిటీ వేయాలని నిర్ణయించారు. దుబ్బాకలో ప్రతి నాయకుడు వారికి అప్పగించిన పనిని చాలా చిత్తశుద్ధి, విధేయతతో చేశారని కొనియాడారు.

ఇదీ చదవండి:రైతుల సంతకాల సేకరణ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్​ల నియామకం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details