Congress Mana Ooru Mana Poru : "మన ఊరు - మన పోరు" నినాదంతో సభలు నిర్వహిస్తూ.. స్థానిక సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజాపోరాటాలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు జూమ్ యాప్ ద్వారా సమావేశమైన పీసీసీ కార్యవర్గం పలు అంశాలపై చర్చించింది. పరిగి, వేములవాడ, కొల్లాపూర్‌లలో ఏర్పాటు చేసే సభల నిర్వహణపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కార్యనిర్వాహణ అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు సమాలోచనలు చేశారు. స్థానిక సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజాపోరాటాలు చేయాలని నిర్ణయించారు.
Congress Mana Ooru Mana Poru : ఈ నెల 26 నుంచి 'మన ఊరు-మన పోరు' సభలు
Congress Mana Ooru Mana Poru: తెలంగాణలో ఈ నెల 26 నుంచి "మన ఊరు - మన పోరు" సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు జూమ్ యాప్ ద్వారా సమావేశమైన పీసీసీ కార్యవర్గం పలు అంశాలపై చర్చించింది.
మార్చి 3 నుంచి ప్రారంభంకానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపైనా పీసీసీ నేతలు దృష్టిసారించారు. మార్చి 14 నుంచి తిరిగి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాలు.. ఆలోపు రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు రూపకల్పనపైనా చర్చించారు. ఏప్రిల్ 1 నుంచి పార్టీ డిజిటల్ సభ్యత్వ బీమా ప్రారంభమవుతుండగా... కార్యక్రమం వేగవంతం చేసే అంశాలు చర్చకు వచ్చాయని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి :ఉక్రెయిన్లో చిక్కుకున్న కరీంనగర్ విద్యార్థులు.. బండి సంజయ్కు ఫోన్