భారత దేశ పౌరులకు మళ్లీ ధ్రువీకరణ ఎందుకని టీపీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్‌లు ప్రశ్నించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం కేవలం వ్యతిరేకించడానికే తప్ప ఆపేందుకు ఉపయోగపడదని పేర్కొన్నారు.
'ఎంఐఎం, ముస్లిం ఓట్ల కోసమే అసెంబ్లీ తీర్మానం' - TPCC Spokes Persons fires on TRS
భాజపా ప్రభుత్వం మతాల మధ్య వైషమ్యాలు పెట్టడానికి చట్టాలు చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. కేంద్రం చేస్తున్న కుట్రలను తెరాస ఎలా అడ్డుకోనుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
!['ఎంఐఎం, ముస్లిం ఓట్ల కోసమే అసెంబ్లీ తీర్మానం' TPCC Spokes Persons respond about CAA,NRC,NPR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6441965-29-6441965-1584447565670.jpg)
TPCC Spokes Persons respond about CAA,NRC,NPR
ఎంఐఎం, ముస్లిం ఓట్ల కోసమే తెరాస ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిందని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకోని ఛైతన్యవంతులు కావాలని కోరారు.
'ఎంఐఎం, ముస్లిం ఓట్ల కోసమే అసెంబ్లీ తీర్మానం'
ఇవీ చూడండి:దిశ తరహా మరో ఘటన.. రంగారెడ్డి జిల్లాలో మహిళ హత్యాచారం