Erravalli Congress Protest: జూబ్లీహిల్స్‌లోని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నేడు ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సన్నద్ధమయ్యారు. వరి సాగుతో పాటు అన్నదాతల సమస్యలపై గళమెత్తాలని నిర్ణయించారు. ఎర్రవల్లికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై వ్యంగ్యంగా స్పందిస్తూ రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. పోలీసుల దారులన్నీ తన ఇంటివైపే ఉన్నాయని.. స్వాగతిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు.
ఎన్ని నిర్బంధాలున్నా.. ఎర్రవల్లికి వెళ్లి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎర్రవల్లి గ్రామం ఏమైనా నిషేధిత ప్రాంతమా? పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? తాను చేపట్టిన రచ్చబండకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? తెరాస, భాజపా కలిసి వడ్ల అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి. ఉమ్మడి కుట్రలో భాగంగానే మంత్రులు దిల్లీ వెళ్లొచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు.
-రేవంత్ రెడ్డి, పీసీసీ ఆధ్యక్షుడు
ఎర్రవల్లికి వెళ్తే తప్పా?