గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించారు.
డిసెంబర్ 2న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు: ఉత్తమ్
గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా అధ్యక్షతన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశమైంది. ఆర్టీసీ ఛార్జీలు పెంచొద్దని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. డిసెంబర్ 14న దిల్లీలో జరిగే భారత్ బచావో ర్యాలీలో పాల్గొంటామని తెలిపారు.
శంషాబాద్ ఘటనపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యువతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచొద్దని.. భారం ఎంతైనా ప్రభుత్వమే భరించాలన్నారు. ఛార్జీల పెంపునకు నిరసనగా సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 14న దిల్లీలో ఏఐసీసీ నిర్వహించే భారత్ బచావో ర్యాలీలో పాల్గొంటామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10 మందిని దిల్లీకి తీసుకెళ్తామని టీపీసీసీ చీఫ్ చెప్పారు.
ఇవీ చూడండి: ఉరేసరి... వైద్యురాలి హత్యపై భగ్గుమన్న సమాజం