తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళా అధికారిణిపై దాడి ఆటవిక చర్య'

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో అటవీ అధికారులపై జరిగిన దాడిని ఆటవిక చర్యగా కాంగ్రెస్​ అభివర్ణించింది. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా తెరాస నాయకులు అడ్డుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి ధ్వజమెత్తారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు

By

Published : Jun 30, 2019, 9:32 PM IST

అటవీ అధికారులపై దాడి హేయమైన చర్య
ఆసిఫాబాద్​ జిల్లాలో మహిళా అధికారిణిపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ దాడి చేయడాన్ని కాంగ్రెస్​ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్నప్పుడు తెరాస నాయకులు విచక్షణారహితంగా కర్రలతో దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కుటుంబపాలన, అరాచకం, ఎక్కువైందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్​ డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details