తెలంగాణ

telangana

ETV Bharat / state

అరెస్టులపై డీజీపీకి ఉత్తమ్​ లేఖ - tpcc chief uttamkumar reddy latest news

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాశారు. కాంగ్రెస్ పట్ల పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. లేఖను పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌ దామోదర్‌ రెడ్డి... డీజీపీని స్వయంగా కలిసి అందజేశారు.

uttamkumar reddy wrote letter to dgp
డీజీపీకి ఉత్తమ్​ లేఖ

By

Published : Jun 12, 2020, 9:30 PM IST

తెలంగాణలో కాంగ్రెస్​ నేతల పట్ల పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరుపై రాష్ట్ర డీజీపీకి ఉత్తమ్​ లేఖ రాశారు. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... సచివాలయానికి వెళ్లే కార్యక్రమం చేపడితే అరెస్ట్​ చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

ప్రజా ప్రతినిధుల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని ఉత్తమ్​ ఆరోపించారు. పోలీసుల వైఖరి ఇలాగే కొనసాగితే పార్లమెంట్, అసెంబ్లీలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. శనివారం గోదావరి ప్రాజెక్టులు పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్ బృందానికి ఆటంకం కలిగించొద్దని ఉత్తమ్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:గోదావరి జలదీక్షపై కాంగ్రెస్ రహస్య వ్యూహరచన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details