తెలంగాణలో భాజపా బలోపేతం కావటానికి ఆస్కారమే లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దిల్లీలో సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశానికి ఉత్తమ్ హాజరయ్యారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని నేతలు నిర్ణయించినట్లు ఉత్తమ్ తెలిపారు. త్వరలో ప్రారంభమవనున్న పార్టీ సభ్యత్వ నమోదు గురించి పలు సూచనలు చేసినట్లు చెప్పారు. గతంలో 20 లక్షల మంది నమోదు చేసుకున్న సభ్యత్వాలను 35 లక్షలకు పెంచే లక్ష్యంతో పనిచేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై పీసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి... నిపుణులు, విశ్లేషకులతో నాయకులకు లోతుగా అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. భాజపా నిర్ణయాల వల్ల జరిగిన దుష్పరిణామాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తెలంగాణలో భాజపా బలోపేతం కావడానికి ఆస్కారమే లేదన్నారు ఉత్తమ్.
'రాష్ట్రంలో భాజపా బలోపేతానికి ఆస్కారమే లేదు' - గాంధీజీ 150వ జయంతి
భాజపా నిర్ణయాల వల్ల జరిగిన దుష్పరిణామాలను ప్రజలకు వివరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశానికి ఉత్తమ్ హాజరయ్యారు. సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు.
TPCC CHIEF UTTAM KUMARE REDDY FIRE ATTENDED FOR AICC MEETING