తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస మోసాలే... పుర ఎన్నికల్లో మన అస్త్రాలు' - తెలంగాణ పురపాలక ఎన్నికలు

పురపాలక ఎన్నికల్లో తెరాస, భాజపాలను చిత్తుచిత్తుగా ఓడించాలని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి పిలుపునిచ్చారు. ఆరేళ్లలో కేసీఆర్​ సర్కార్ చేసిందేమీ లేదని విమర్శించారు.

tpcc chief uttam kumar reddy on municipal elections in telangana
టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి

By

Published : Jan 16, 2020, 4:57 PM IST

తెరాస చేసిన మోసాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని హస్తం అభ్యర్థులకు టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి సూచించారు. మున్సిపల్​ ఎన్నికల్లో తెరాస, భాజపాలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్​ గాందీభవన్​లో పుర ఎన్నికల డాక్యుమెంట్​ విడుదల చేశారు. శుక్రవారం డీసీసీ అధ్యక్షులు అన్ని జిల్లా కేంద్రాల్లో విడుదల చేయాలని సూచించారు. మున్సిపాలిటీలకు దగ్గర ఉన్న గ్రామాల నాయకులు ప్రచారానికి వెళ్లాలని ఆదేశించారు.

టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details